![]() |
![]() |
.webp)
ప్రస్తుతం తెలుగు టీవీ షోలలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ శ్రీముఖి. అల్లరి రాములమ్మగా పాపులర్. బిగ్ బాస్ తర్వాత భారీ ఫాలోయింగ్ తో వరుస షోలలో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు శ్రీముఖితో పాటు వాళ్ళ అమ్మ వైరల్ గా మారింది. అంతలా ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.
శ్రీముఖే ఎనర్జీ లౌడ్ స్పీకర్ అంటే.. ఆమె తల్లి లత శ్రీ అంతకుమించి. లతశ్రీ. సోషల్ మీడియాలో చేసే రీల్స్‌కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి అయినా అప్పుడప్పుడు సోషల్ మీడియాకి కాస్త గ్యాప్ ఇస్తుందేమో కానీ లతశ్రీ అయితే రీల్స్‌ను చేస్తూనే ఉంటుంది.
శ్రీముఖి వాళ్ళ అమ్మ లతశ్రీ.. రకరకాల గెటప్‌లు వేసి తన డాన్స్ తో రచ్చ చేస్తుంది. ఈమెతో పాటు భర్త రామ్ కిషన్ కూడా రీల్స్‌లో జతకలుస్తుంటాడు. వీళ్ళిద్దరు కలిసి రీల్స్ చేస్తూ తమ టాలెంట్ చూపిస్తుంటారు. ఎనర్జీలో కూతుర్ని మించే అనేట్టుగా ఈ ఇద్దరూ రీల్స్‌తో చెలరేగిపోతున్నారు. అయితే వీళ్ల రీల్స్ చూసి క్యూట్ అనేవాళ్లు ఉన్నట్టే.. వామ్మో వీళ్లేంట్రా ఇలా ఉన్నారని సెటైర్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యామిలీ ఫ్యామిలీ రీల్స్ చేసి బతికేస్తున్నారా అని కామెంట్లు చేసే వాళ్ళున్నారు.
.webp)
తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఓ రీల్ చేయగా.. మిమ్మల్ని చూస్తుంటే ఓ సామెత గుర్తొస్తుందని ఒకరు కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కి రియాక్ట్ అయిన శ్రీముఖి ఫాదర్.. ఆపేశావేం.. ఆ సామెత ఏంటో చెప్పు అని రిప్లై ఇచ్చాడు. దాంతో ఆ నెటిజన్ ఇలా కవర్ చేసారు. ఈ వయసులో ఉన్నప్పుడు మీరు గానీ మేడమ్ గారు గానీ ఇంత యాక్టివ్ గా ఉన్నారు.. ఇంకా శ్రీముఖిలాగా ఉన్నప్పుడు ఇంకెంత యాక్టివ్ గా ఉన్నారో అంటున్నాను సర్.. నేను శ్రీముఖికి పెద్ద ఫ్యాన్ ని ఇంకా. మీరన్న మేడమ్ గారు అన్నా చాలా ఇష్టమని కవర్ చేశారు. అయితే దానికి శ్రీముఖి ఫాదర్ కౌంటర్ ఇస్తూ.. చెప్పండి చెప్పండి వినాలని ఉందని అంటూ కవర్ డ్రైవ్ వేసిన విషయాన్ని చెప్పమన్నాడు. ఇలా సోషల్ మీడియాలో సెలబ్రిటీల రీల్స్, ఫోటోలకి కామెంట్లు రావడం సాధారణం.. కానీ ఓ నెటిజన్ కామెంట్ కి శ్రీముఖి ఫాదర్ రియాక్ట్ కావడం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. అయితే ఇప్పుడు ఈ కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది.
![]() |
![]() |